ఏఎన్‌ఎంల పదోన్నతులపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఏఎన్‌ఎంల పదోన్నతులపై ఫిర్యాదు

Jan 3 2026 8:00 AM | Updated on Jan 3 2026 8:00 AM

ఏఎన్‌ఎంల పదోన్నతులపై ఫిర్యాదు

ఏఎన్‌ఎంల పదోన్నతులపై ఫిర్యాదు

ఏఎన్‌ఎంల పదోన్నతులపై ఫిర్యాదు

సారవకోట : జిల్లాలోని వైద్యారోగ్య శాఖ ఏఎన్‌ఎంల పదోన్నతుల్లో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరపాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ సభ్యులు కోరారు. ఈ మేరకు విజయవాడలో శుక్రవారం ఆ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఏఎన్‌ఎం సీనియారిటీ లిస్టు విడుదల చేయలేదని, పదోన్నతుల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించలేదని, ఆదివాసీలకు ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించలేద ని ఆరోపించారు. లక్షలాది రూపాయలు వసూలు చేసి అడ్డగోలుగా మెరిట్‌ లిస్టు తయారు చేసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు, జిల్లా అధ్యక్షు డు గురాడి అప్పన్న, మెళియాపుట్టి మండల అధ్యక్షుడు ఎస్‌.గణేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement