తీర్థ యాత్రకు బయలుదేరిన సీనియర్ సిటిజన్లు
జయపురం: సీనియర్ సిటిజన్‌ల తీర్థ యాత్రల పథకంలో భాగంగా జయపురం పట్టణం నుంచి 15 మందిని పంపుతున్నారు. వీరు తమిళనాడు రాష్ట్రం రామేశ్వర్‌కు సోమవారం బయలుదేరారు. వీరికి జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి వారికి వీడ్కోలు పలికారు. తీర్థ యాత్రల కు జయపురం నుంచి బయలు దేరిన వారిలో నలుగురు పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. ఒక ప్రత్యేక వాహనంలో వీరు కొరాపుట్ మీదుగా రాయగడకు బయలుదేరివెళ్లారు. వీరందరికీ అవస రమైన పత్రాలు సమకూర్చారు. వీరు రాయగడలో ట్రైన్ ఎక్కి దక్షిణ భారత దేశ యాత్రకు బయలుదేరారని అధికారులు వెల్లడించారు. వీరు తమిళనాడులో రామేశ్వర్, మధురై, తదితర పుణ్యక్షేత్రాలను దర్శిస్తారన్నారు.


