విపత్తులను ఎదుర్కోవడంపై శిక్షణ
పర్లాకిమిడి: రాయఘడ బ్లాక్ గండాహతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం 11 వ జిల్లా స్థాయి రెడ్ క్రాస్ స్టడీ, శిక్షణ శిబిరాన్ని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ప్రారంభించారు. ఈ రెడ్ క్రాస్ శిక్షణ శిబిరానికి జిల్లా ముఖ్య విద్యాధికారి మాయాధర్ సాహు అధ్యక్షత వహించారు 400 జూనియర్ క్యాడెట్లు, 150 మంది పరామర్శ దాతలు పాల్గొన్నారు. వీరికి మూడు రోజుల పాటు అగ్ని ప్రమాదంలో అనుసరించాల్సిన శిక్షణ, వరదల సమయంలో ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి, రాహదారి భద్రత, ప్రాథమిక చికిత్సపై శిక్షణ అందిస్తారు. ఈ రెడ్ క్రాస్ శిక్షణ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడారు. తుఫాన్, కరువు, వరదలు, అగ్నిప్రమాదాల సమయంలో ప్రజల రక్షించాలన్నారు. ఈ శిక్షణ శిబిరంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ, గౌరవ అతిథులుగా రాయఘడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాల్మన్ రైకా, బీడీఓ సంతోష్ కుమార్ బారిక్, రాయఘడ వైస్ చైర్మన్ జ్యోతి ప్రసాద్ పాణి, పాఠశాల పర్యవేక్షన కమిటీ అధ్యక్షుడు అశోక్ దోళాయి, ప్రధాన ఉపాధ్యాయులు సౌమ్యరంజన్ సాహు, జిల్లా పాఠశాలల శారీరిక శిక్షణాధికారి సురేంద్ర పాత్రో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడు రోజుల పాటు గండాహతి పాఠశాలలో రెడ్‌క్రాస్ శిక్షణ కార్యక్రమం కోనసాగుతోందని డీఈఓ తెలియజేశారు.
విపత్తులను ఎదుర్కోవడంపై శిక్షణ


