గుణుపూర్–తెరువలి రైలు లైన్ నిర్మాణంపై సమీక్ష
రాయగడ: దక్షిణాంచల్ రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్‌డిసి) సంగ్రామ్ కేసరి మహాపాత్రో సొమవారం గుణుపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గుణుపూర్ నుంచి తెరువలి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన పనులపై సమీక్షించారు. గుణుపూర్ సబ్ కలెక్టర్ దదుల్ అభిషేక అనిల్, రామనగుడ తహసీల్దార్ ప్రాణకృష్ణ పాణిగ్రహి, గునుపూర్ అదనపు తహసీల్దార్ గయా డొంబురు ధర బెహర, బిసంకటక్ తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి, మునిగుడ తహసీల్దార్ ఎం.అనురాధ, రైల్వే శాఖ అధికారి సుభ్రత్ పండ, ఇంజినీర్లు బి.రమేష్, ప్రద్యుమ్న దొలాయి తదితరులు పాల్గొన్నారు. గుణుపూర్ నుంచి తెరువలి వరకు అనుసంధానించే కొత్త రైలు లైన్ నిర్మాణానికి సంబంధించి చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్న ఆర్డీసీ కేసరి మహాపాత్రో ఆయా మార్గంలొ అవసరమయ్యే స్థల సేకరణకు సంబంధించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. స్థల సేకరణ పనులు పూర్తయితే రైలు నిర్మాణానికి సంబంధించి ఆ శాఖ పనులకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ఈ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1165 కోట్ల నిధులను వినియోగిస్తుందని అన్నారు.


