రామేశ్వరం–మధురై తీర్థయాత్రలకు వృద్ధుల పయనం
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా స్పోర్ట్స్ స్టేడియం నుంచి మంగళవారం కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రదన్ రెండు బస్సుల్లో 75 మంది వృద్ధులను రామేశ్వరం, మధురై తీర్థయాత్రలకు పంపించేందుకు బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులు రాయగడ వరకు వెళ్తాయి. అక్కడి నుంచి రైలులో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం, మధురై పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వీరందరికీ వారం ముందుగానే వైద్యపరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రైలులో వైద్య, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. వృద్ధులకు ఎస్కార్ట్ అధికారులుగా క్రీడా శిక్షకురాలు బబితా మహంతి, ఖోయిర్‌పూట్ తహసీల్దార్ సరోజ్ నాయక్ యాత్రలో పాల్గొంటారు.


