పర్యాటక రంగానికి పెద్దపీట
రాయగడ: రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడ అన్నారు. రాయగడ పర్యటనకు సోమవారంవచ్చిన ఆమె స్థానిక సర్క్యూట్ హౌస్‌లో అధికారుల తో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణి, ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాయగడలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని.. వాటిని అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. అనంతరం జిల్లాలో శిశు వికాసం, మిషన్ శక్తి, విద్య, వైద్యం, సమగ్ర గ్రామీణాభివృద్ధి సంస్థ చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. గర్భిణులకు పౌష్టికాహరం పంపిణీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ఐసీడీఎస్ కార్యకర్తలు సమన్వయంగా వ్యవహరించాలని అన్నారు.
ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడ


