ఘనంగా 25వ వార్షికోత్సవం
జయపురం: జయపురం రాజువీధిలో గల అరవింద పూర్ణాంగ విద్యా కేంద్రం సేవలు అభినందనీయమని జయపురం మున్సిలప్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి అన్నారు. సోమవారం సాయంత్రం జరిగిన విద్యా కేంద్రం 25వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అరవిందుని చిత్రపటానికి పూజించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. గత 25 ఏళ్లుగా నిస్వార్థంగా విద్యార్థులకు సేవలు అందిస్తోందన్నారు. ఈ విద్యా కేంద్రం ఉన్నతికి మున్సిపాలిటీ తరఫున అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అరవిందాశ్రమ సాధకురాలు సుజాత పాడీ ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఆమె ప్రసంగిస్తూ విద్యార్థులకు గుణాత్మక విద్యతోపాటు సక్రమ మార్గంలో నడిపించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటమే అరవింద పూర్ణాంగ విద్యా కేంద్రం లక్ష్యం కావాలన్నారు. హరిహర కరసుధా పట్నాయక్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విద్యాలయ ప్రిన్సిపాల్ పంచానన మిశ్ర పర్యవేక్షణలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కొరాపుట్ జిల్లాలోని 9 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చినవారికి మెమొంటాలతో సన్మానించారు. కొరాపుట్ జిల్లా అరవింద ఖర్మధార కోఆర్డినేటర్ ప్రశాంత కుమార్ స్వైయ్, కార్యకర్తలు తరణీ చరణ పాడీ, మీనకేతన సాహు, విద్యాలయ పరిచాలన కమిటీ సభ్యులు ప్రశాంత పొరిడ, తేజేశ్వర పండా, ఉమాశంకర ఆచారి, బైద్యనాథ్ మిశ్ర, విద్యాలయ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఘనంగా 25వ వార్షికోత్సవం


