గ్రామాల్లో బీజేడీ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ పర్యటన
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి రఖుల్‌గూడ గ్రామంలో లక్కే పోడియమి అనే మహిళ తల నరికిన ఘటన చోటు చేసుకున్న ఘటన తెలిసిందే. వారం రోజులుగా ఈ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరిని శాంతింపజేసేందుకు ఈ బృందం ఎంవీ 26 గ్రామంలో పర్యటించి ప్రతి ఇళ్లను పరిశీలించారు. పర్యటన సందర్భంగా పోలీసులు 40 ప్లటూన్ల బలగాలను మోహరించారు. బృందంలో మాజీ మంత్రి రమేశ్ మాఝి, రవి నారాయణ్ నంద్, మాజీ ఎంపీ ప్రదిప్ మాఝి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, సీనియర్ బీజేడీ అధ్యక్షుడు మనాస్ మాడ్కమి, సీనియర్ నేత ఈశ్వర్ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.


