జ్యుడీషియల్ కమిటీ వేయాలి
జలుమూరు: కూటమి ప్రభుత్వం చేస్తుటన్న అరాచాకాలపై జ్యుడీషియల్ కమిటీ వేసి న్యాయ విచారణ చేపట్టాలని శ్రీముఖలింగం అర్చకుడు నాయుడుగారి రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీముఖలింగం మూడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదని.. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదం పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయని ప్రకటించడం, ఆవి వెనక్కు వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు. ప్రసాదం పథకం అంటే ప్రసాదాలు మాదిరిగా తినేయేడమా అని ప్రశ్నించారు. నరసన్నపేట ఎమ్మేల్యే బగ్గు రమణమూర్తి అనుచరులు ఆలయం లోపల, బయట జరిగే పనులలో అవినీతికి పాల్పడుతున్నారని, వాటిపై ప్రశ్నించినందుకు తనపై హత్యాయత్నం చేశారన్నారు. అర్చకులకే భద్రత లేని ఈ ప్రభుత్వంలో ఎవరికి భద్రత ఉంటుందని మండిపడ్డాడు. జంతర్ మంతర్ సాక్షిగా దేశంలో ఉన్న వంశపారం పర్య అర్చకుల భద్రత కల్పించాలని కోరారు.


