గుండెలు మండయ్
మండయ్ వేదిక మీద దూషణల
పర్వం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం మండయ్–2025 వేదిక మీద దూషణ పర్వం అందరినీ విస్తుగొలిపింది. ఆదివారం రాత్రి నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం సమీపంలో మండయ్ వేదిక మీద 3వ రోజు సాంస్కృతిక ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. వేదిక మీద జిల్లాకు చెందిన ప్రతిపక్ష బీజేడీ డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి ప్రసంగం కొనసాగింది. అకస్మాత్తుగా రంధారి ఆగ్రహవేశాలకు లోనయ్యారు. అదే వేదిక మీద ఉన్న కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ ని నేరుగా ఉద్దేశిస్తూ నిలదీశారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని గుర్తు చేశారు. తనను కలెక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఒకానొక సమయంలో కలెక్టర్‌ను ఏకవచనంతో సంబోధించారు. జిల్లాలో సుమారు 200 గ్రామాలకు కనెక్టవిటీ లేదని, జిల్లాలో వరి, మొక్కజొన్న రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఇక్కడ నాటకాలు ఆడుతున్నారన్నారు. ఈ పరిస్థితి చూసి వేదిక మీద బీజేపికి చెందిన మంత్రులు రబి నాయక్, నిత్యానంద గొండో అవాక్కయ్యారు. బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీజేపీ కార్యకర్తల ఆగ్రహావేశాలు
బీజేడి ఎమ్మెల్యే రంధారి ప్రసంగం పై ప్రజలలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ వేదిక కిందకు దూసుకు వచ్చారు. అప్పటికీ రంధారీ తన విమర్శలు కొనసాగించారు. బీజేపీకి చెందిన కను దాస్, అర్జున్ త్రిపాఠి తదితరులు రంధారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంధారి స్పందిస్తూ తను పులి నని ఇలాంటి నినాదాలకు భయపడనని పదే పదే ఉద్ఘాటించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు రంధారిని పులి కాదని పిల్లి అని కేకలు వేశారు. చివరకు ఈ పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వైపులా బూతు పురాణం ప్రారంభమైంది. వేదిక మీద ఉన్న డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ఇరు వర్గాలను సుమదాయించేందుకు ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ వేదిక కింద ఉన్న బీజేపీ కార్యకర్తలకు సముదాయించారు. వేదిక మీద ఉన్న రంధారిని అధికారులతో పాటు బీజేపీకి చెందిన మాజీ ఎంపీ పరశురాం మజ్జి, ఇతర నాయకులు సముదాయించి బలవంతంగా తీసుకువెళ్లారు. చివరలో రంధారి మాట్లాడుతూ ఇది బీజేపీ మండయ్ కాదని ప్రజల మండయ్ అంటూ నిష్క్రమించారు. ఇదే వేదిక మీద ఉన్న మంత్రి నిత్యానంద గోండో మాట్లాడుతూ ఎవరూ పులి,పిల్లి కాదన్నారు. అభివృద్ధి మార్గంలో ప్రతిభ చూపి పులి అనిపించుకోవాలని హితవు పలికారు.
గుండెలు మండయ్
గుండెలు మండయ్
గుండెలు మండయ్
గుండెలు మండయ్
గుండెలు మండయ్


