మజ్జి గౌరి మందిరానికి గుర్తింపు తీసుకువస్తాం
రాయగడ: ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి మందిరానికి దేశంలోనే మంచి గుర్తింపు వచ్చేలా చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడ అన్నారు. ఆమె సోమవారం రాయగడలో పర్యటించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని, వారికి సదుపాయాలు కల్పించడంతో పాటు అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.29 కోట్లు మంజూరు చేసిందన్నారు. టెండర్లు కూడా పిలిచారని త్వరలోనే పనులు మొదలవుతాయని తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి ప్రభాతీ పరిడకు ఆలయ మేనేజింగ్ ట్రస్టీ రాయసింగి బిడిక, ట్రస్ట్ సభ్యులు తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, బాబు దళాయి, వడ్దాది శ్రీనివాస్‌రావు, పెద్దీన వాసు, బాబు దళాయి, దేవేంద్ర నాథ్ బెహర, ఇంజనీర్ వెంకట్ తదితరులు ఆమెను సన్మానించి అమ్మవారి ఫొటోను అందజేశారు.
మజ్జి గౌరి మందిరానికి గుర్తింపు తీసుకువస్తాం


