అదృష్టం వరించేనా..!
● నేడు ఐపీఎల్–19 మినీ అక్షన్ ● జిల్లా నుంచి రేసులో ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్
త్రిపురాన
విజయ్
ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్
శ్రీకాకుళం న్యూకాలనీ: భారత క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకసారైనా ఐపీఎల్‌కు ఎంపికై తే చాలని సగటు క్రికెటర్ కలగంటాడు. ఐపీఎల్‌కు ఎంపికై తే వారి దశ, దిశ తిరిగిపోవడం ఖాయం. ఇందుకు భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఆడుతున్న పలువురు క్రికెటర్లే నిలువెత్తు సాక్ష్యం. 2026 మార్చి నుంచి మే నెలల్లో జరగనున్న ఐపీఎల్ సీజన్–19కు మినీ వేలం మంగళవారం యూఏఈలోని అబుదాబి వేదికగా షురూ కానుంది. వివిధ ప్రాంచైజీలు వేలంలో క్రీడాకారులను కొనుగోలు చేసే ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో జిల్లాకు చెందిన సింగుపురం దుర్గా నాగవర(ఎస్‌డీఎన్‌వీ) ప్రసాద్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ఐపీఎల్ రేసులో ఉన్న యువ క్రికెటర్ జలుమూరు చెందిన సింగుపురం దుర్గా నాగ వర (ఎస్‌డీఎన్‌వీ)ప్రసాద్. గత ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఆఖరి నిమిషంలో ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు. అనంతరం జరిగిన కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీ, టీ–20 టోర్నీ అనేక టోర్నీల్లో విశేషంగా రాణిస్తూ వచ్చాడు. ఏపీఎల్ సీజన్–4లో అమరావతి రాయల్స్ జట్టుకు రికార్డు స్థాయిలో రూ. 9.50 లక్షలకు అమ్ముడయ్యాడు. తాజాగా బీసీసీఐ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ సీనియర్స్ టీ–20 క్రికెట్ టోర్నీలో కీపర్ కమ్ బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు. దీంతో ఈసారి ఐపీఎల్ షార్ట్ లిస్టులో ఉండడంతో ఎంట్రీ దొరుకుతుందని భావిస్తున్నాడు. జలుమూరు పోలీస్‌స్టేషన్ వీధిలో నివాసం ఉంటున్న ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్.. తండ్రి సింగుపురం ఉపేంద్రం కారు డ్రైవర్‌గా పనిచేస్తు 2019లో అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి రేవతి జలుమూరు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్నారు.
గతేడాది ఐపీఎల్ సీజన్–18లో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి జాక్‌పాట్ కొట్డాడు త్రిపురాన విజయ్. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ 23 ఏళ్ల కుర్రాడిని గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫైనల్ లెవన్‌లో చోటు దక్కనప్పటికీ.. పలు మ్యాచ్‌ల్లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలో అలరించాడు. ఐపీఎల్ అనంతరం ఈ ఏడాది అనేక రంజీ మ్యాచ్‌ల్లో అటు రైటార్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోను మెరిశాడు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఏపీఎల్ 4వ సీజన్‌లో రాణించాడు. విజయ్‌ను రూ.7.55 లక్షలకు వైజాగ్ లయన్స్ కొనుగోలు చేసింది. టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి త్రిపురాన వెంకటకృష్ణరాజు సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి లావణ్య గృహిణి. ఈ సీజన్‌లో విజయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి రిటైన్ చేసుకుంది.
అదృష్టం వరించేనా..!
అదృష్టం వరించేనా..!


