ప్రాచీన సంప్రదాయాలను కాపాడుకోవాలి
జయపురం: ప్రాచీన సంప్రదాయాలు, ఆచారాలు, కళలను కాపాడుకోవాలని వక్తలు అన్నారు. వీటి కోసం ఉద్యమిస్తున్న తరుణ ప్రజ్ఞాభారతి సంస్థ కార్యక్రమాలు కొనియాడ దగ్గవని స్థానిక విక్రమదే వ్ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర అన్నారు. ఆదివారం రాత్రి జయనగర్ గ్రామంలోని సంఘం కళ్యాణ మండపంలో జరిగిన జయపురం తరుణ ప్రజ్ఞా భారతి 37వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తరుణ ప్రజ్ఞాభారతి అధ్యక్షులు తపన్ కిరన్ త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తరుణ ప్రజ్ఞాభారతి వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ గంగాధర నందో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐదు ఆదివారాల్లో జరిగిన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీ ల్లో విజేలకు ముఖ్యఅతిథి డాక్టర్ దేవీప్రసాద్ మిశ్ర తో పాటు గౌరవ అతిథి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చందనకుమార్ నాయిక్, సమాజ సేవక్ ప్రకాశ్ చంద్రనాయిక్, పతాంజలీ యోగాపీఠ రాష్ట్ర సహాయ ప్రహారీ జానకీ పాణిగ్రహిలు బహుమతులు అందజేశారు. ప్రజ్ఞాభారతి కార్యదర్శి అజయ కుమార్ మల్లిక్ సంస్థ నివేదికను సమర్పించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ప్రముఖులను నిర్వా హకులు దుశ్శాలువలతో సత్కరించి గౌరవించాుర. ప్రఖ్యాత నేత్ర వైద్యులు డాక్టర్ డి.హరికృష్ణ, సంధ్యారాణి దంపతులను డాక్టర్ గంగాధర నందో ఆదర్శ దంపతులు సత్కరించారు. అలాగే వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని కూడా సత్కరించి గౌరవించారు. సభ్యులు సబిత శతపతి, లిపిక దొలాయ్, ఉపాధ్యక్షులు రామశంకర షొడంగి, క్షేత్ర మోహణ నాయిక్, న్యాయ సలహాదారు జి.మహేష్, జగన్నాథ్ పాణిగ్రహి, కృష్ణకేశవ షొడంగి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.
ప్రాచీన సంప్రదాయాలను కాపాడుకోవాలి


