సెంచూరియన్ విద్యార్థి ప్రతిభ
పర్లాకిమిడి: స్థానిక సెంచూరియన్ పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎన్.కుమార్ భరద్వాజ్ ప్రతిష్టాత్మకమైన 18వ యంగ్ ఆస్ట్రానమర్ టాలెంట్ సెర్చ్ పోటీల్లో 30 మంది ఫైనలిస్టులలో ఎంపికై బహుమతి గెలుచుకున్నాడు. భువనేశ్వర్‌లో జయదేవ్ భవన్‌లో ఈ నెల 13న రాష్ట్ర ఆహార శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో చేతుల మీదుగా బహు మతి అందుకుఆన్నరు. కుమార్ భరధ్వాజ్‌కు ఇస్రో సంస్థకు చెందిన ఒక కేంద్రాన్ని సందర్శించే అరుదై న అవకాశం లభించనుంది. అంతరిక్ష ఖగోళ శాస్త్రంపై భరద్వాజ్‌కు మరింత ఆసక్తిని పెంపొందించి భవిష్యత్తులో ఆ రంగంలో కేరీర్‌ను ఎంచుకునేందు కు ప్రేరణగా నిలవనున్నట్టు ప్రిన్సిపాల్ సునీతా పాణిగ్రాహి అన్నారు. సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంతీయ అడ్మిషన్స్ డైరెక్టర్ సంబిత్ పాత్రో, ఫ్యాకల్టీ భరధ్వాజ్‌కు అభినందనలు తెలిపారు.


