దివ్యాంగులకు ట్రై సైకిల్ పోటీలు
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న చోయితీ జిల్లాస్థాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రీతోత్సవాలను పురస్కరించుకుని దివ్యాంగులకు ట్రై సైకిల్ పోటీలను ఉత్సవ కమిటీ సోమవారం నిర్వహించింది. స్థానిక అంబేడ్కర్ కూడలి నుంచి పోటీలను ప్రారంభించారు. జిల్లా సామాజిక సురక్షా అధికారి అనిల్‌కుమార్ పాణిగ్రహి ముఖ్యఅతిథిగా పచ్చజెండా ఊపి పోటీలను ఆరంభించారు. పోటీల్లో మొత్తం 12 మంది పాల్గొనగా నీలకంఠం ప్రథమ, అభిరాం కొరొకొరియా ద్వితీయ, సంజయ్ సేనాపతి తృతీయస్థానంలో నిలిచారు. అలాగే చిరంజీవి పట్రిక, కె.రామారావు, జానకీ సాహులు ప్రోత్సాహక బహుమతులను గెలుచుకున్నారు. జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్ విజేతలను అభినందించారు. జిల్లాస్థాయి చొయితీ ఉత్సవ వేదికపై వీరికి బహుమతులు అందజేస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు.
దివ్యాంగులకు ట్రై సైకిల్ పోటీలు


