రగ్గుల పంపిణీ
జయపురం: ఒడిశా బలిజి సంఘం జయపురం వారు సోమవారం 40 కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షుడు వై.శ్రీనివాస ఖన్నా మాట్లాడుతూ జయపురంలో బలిజిల ఆర్థిక, సామాజిక వికాసమే లక్ష్యంగా సంఘం పని చేస్తుందన్నారు. త్వరలోనే బ్లడ్ గ్రూపింగ్ శిబిరం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నేడు రగ్గుల వితరణకు జిసాగడం రంగనాథ్ ట్రస్టు వారు సహకరించినట్లు తెలిపారు. రగ్గుల వితరణ అనంతరం సంఘ నేతల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘ అధ్యక్షుడు వై.శ్రీనివాస ఖన్నాతో పాటు ఉపాధ్యక్షులు బల్లిడి ఛత్రపతి శివాజీ, పుప్పాల లక్ష్మీ, కార్యదర్శి బరిగెడ శ్రీనివాస రావు, సహాయ కార్యదర్శులు మహాదాశ్యం నారాయణ రావు, పల్లా తవిటమ్మ తదితరులు పాల్గొన్నారు.
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా బ్లాక్ గులుబ పంచాయతీ కార్యాలయంలో సోమవా రం గ్రామముఖిపరిపాలన, గ్రీవెన్స్‌కు స్పంద న లభించింది. ఈ జాయింట్ గ్రీవెన్స్‌కు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ, జిల్లా పరిష త్ అదనపు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, బీడీఓ రాజీవ్ దాస్, తదితరులు హాజరయ్యారు. గులుబ పంచాయతీ తో సహా డెంగాస్కల్, బిరికోట్, మండిమర, గ్రామ పంచాయతీల నుంచి 146 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం 44, గ్రామ సమ స్యలకు సంబంధించినవి 102 ఉన్నాయి. నాలుగు వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. ముఖ్యంగా పీఎం ఆవాస్ యోజనా, సామాజిక పింఛన్లు, ఉపాధి పథకంపై అనేక వినతులు అందినట్టు అధికారులు తెలియజేశారు. మహిళా స్వయం సహాయక గ్రూపు సభ్యులు స్టాళ్లను ఏర్పాటు చేశారు.
పర్లాకిమిడి: ఈ నెల 22న జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంచడానికి స్థానిక సరస్వతీ శిశువిద్యామందిర్‌లో గణితంలో పోటీలను నిర్వహించారు. పోటీలు రామశంకర్ గంతాయత్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. గణితమంటే భయం వీడాలన్నారు. 17 విద్యాలయాల నుంచి 147 విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఈ నెల 22న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా బహుమతి ప్రదానం చేస్తామని ప్రధాన అచార్యులు సరోజ్ పండా తెలియజేశారు. రామానుజం మాథమెటిక్స్ క్లబ్ సభ్యులు రమాకాంత పట్నాయక్, మనోజ్‌కుమార్ పండా, హరినాథ పాత్రో, తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
రగ్గుల పంపిణీ
రగ్గుల పంపిణీ


