మహేంద్రగిరి, చంద్రగిరిలో రవాణా శాఖ మంత్రి పర్యటన
పర్లాకిమిడి: రాష్ట్ర రవాణా, ఖనిజ శాఖ మంత్రి బిభూతీ జెన్నా గజపతి జిల్లాలోని మహేంద్రగిరి, చంద్రగిరి టిబెటియన్ శరణార్ధుల బౌద్ధ మందిరాన్ని సోమవారం దర్శించుకున్నారు. ఆయన వెంట పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, గంజాం జిల్లా రాజకీయ ప్రతినిధులు ఉన్నారు. తొలుత మంత్రి బిభూతీ జెన్నా మహేంద్రంలో కుంతీ మందిరం వద్ద రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రగిరి జిరంగో వద్ద వున్న టిబెటియన్ల బౌద్ధ మందిరాన్ని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి బిభూతి జెన్నాను బౌద్ధ మెనాస్ట్రీ గురుజీ ఖెంపో సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రి బిభూతీ జెన్నా, గంజాం జిల్లా బీజేపీ ప్రతినిధులకు కండువా, కొమ్ముతో చేసిన జ్ఞాపికలను అందజేశారు.
మహేంద్రగిరి, చంద్రగిరిలో రవాణా శాఖ మంత్రి పర్యటన
మహేంద్రగిరి, చంద్రగిరిలో రవాణా శాఖ మంత్రి పర్యటన


