అపూర్వ సమ్మేళనం
పర్లాకిమిడి: మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు విద్యనభ్యసించిన 1985 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం బంధుమిలన్ పేరిట కలుసుకున్నారు. చైన్నె, ముంబై, విశాఖపట్నం, హైదరాబాదు, భువనేశ్వర్, ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో కలుసుకుని ఆనందంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు డి.సూరప్పడు, ప్రఫుల్ల పాణిగ్రాహి, కుముద్ రంజన్ దాస్, రామ్మోహన్‌రావు పట్నాయక్, తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు ఎన్ని రవికుమార్, శాసనపురి వాసు, మాజీ పురపాలక చైర్మన్ తిరుపతి నాయక్, లింగరాజు, తదితరులు సహకరించారు.


