ఈపీఎఫ్‌ పింఛన్‌ రూ.7,500 మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ పింఛన్‌ రూ.7,500 మంజూరు చేయాలి

Nov 8 2025 7:32 AM | Updated on Nov 8 2025 7:32 AM

ఈపీఎఫ

ఈపీఎఫ్‌ పింఛన్‌ రూ.7,500 మంజూరు చేయాలి

పర్లాకిమిడి: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఈపీఎఫ్‌ ఖాతాదారులకు పింఛన్‌గా నెలకు రూ.7,500, డీఏ. ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలని అఖిల ఉత్కళ భవిష్యనిధి పెన్షన్‌దారులు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక రాజవీధి పెద్ద రాధాకాంత మఠంలో భవిష్య నిధి పెన్షన్‌దారుల సంఘాన్ని నూతనంగా ఏర్పాటు చేసుకున్నారు. అఖిల ఉత్కళ ఈపీఎఫ్‌ పెన్షన్‌దారులకు అధ్యక్షులుగా పినాకి ప్రసాద్‌ జెన్నా, కార్యదర్శిగా గోవింద చరణ్‌ పాత్రో ఎన్నికకాగా, గంజాం అఖి ఉత్కళ భవిష్యనిధి సంఘం సాధారణ కార్యదర్శి ప్రశాంత్‌కుమార్‌ శతపతి కార్యక్రమానికి అధ్యక్షత వహించి భవిష్యత్తు ప్రణాళికను సభ్యులకు వివరించా రు. నెలకు 7,500 రూపాయలు ఇచ్చేవరకూ పోరాడతామని ప్రశాంత్‌ కుమార్‌ శతపతి తెలియజేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు.

మెడికల్‌ దుకాణాల్లో తనిఖీలు

రాయగడ: ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్‌ షాపులు, క్లినిక్‌లతో పాటు ల్యాబ్‌లలో గుణుపూర్‌ సబ్‌ కలెక్టర్‌ అనిల్‌ దుదుల్‌ అభిషేఖ్‌ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గుణుపూర్‌, బైపాస్‌ రోడ్డు, పాత బస్టాండ్‌, బాలికల ఉన్నత పాఠశాల కూడలి తదితర ప్రాంతాల్లో ఎంఎం మెడికోస్‌ క్లినిక్‌, అమూల్య భారత్‌, జోసెఫ్‌ సొబొర్‌, అనంతదాస్‌, అమ్మా క్లినిక్‌, రాధికా డాక్టర్‌ చాంబర్‌ తదితర చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాటిని సీజ్‌ చేయాలని గుణుపూర్‌ సబ్‌ డివిజన్‌ మెడికల్‌ ఇన్‌చార్జిని ఆదేశించారు.

51 తాబేళ్లు స్వాధీనం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు అటవీశాఖ అధికారులు గురువారం రాత్రి 51 తాబేళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఎం.పి.వి–47 గ్రామానికి చెందిన సూరజ్‌ మండల్‌, ఎం.వి.–81 గ్రామానికి చెందిన జయంత్‌ బచాజ్‌లు ఆంధ్రప్రదేశ్‌ నుంచి బైక్‌పై రెండు సంచుల్లో తాబేళ్లను రవాణా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మోటు అటవీశాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది సంయుక్తంగా కలిమెల సమితి కమారగూడ కల్వర్టు వద్ద మాటువేసి అడ్డుకున్నారు. తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. 160 కేజీల బరువున్న వీటిని కిలో 500 చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తుంటారని పోలీసులు తెలిపారు.

విపక్ష నేత విమానం ఆలస్యం

భువనేశ్వర్‌: స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విపక్ష నేత నవీన్‌ పట్నాయక్‌ విమానం బయలుదేరడానికి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని బీజేడీ ఆరోపించింది. శుక్రవారం స్థానిక విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ విమానం దాదాపు 70 నిమిషాలు ఆలస్యమైంది. విమానాశ్రయ అధికారులుఅనుమతి మంజూరు చేయడంలో జాప్యం ఉద్దేశపూర్వకంగా జరిగిందని, నువాపడాలో నవీన్‌ పట్నాయక్‌ పాల్గొనాల్సిన రోడ్‌షో, బహిరంగ సభకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బీజేడీ నాయకులు ఆరోపించారు. దీనిపై అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్‌ ప్రసన్న ప్రధాన్‌ స్పందించి నవీన్‌ పట్నాయక్‌ విమాన ఆపరేటర్‌ విమాన ప్రయాణం ప్రణాళికను సమర్పించలేదని, అందుకే ఎయిర్‌ డిఫెన్స్‌ క్లియరెన్స్‌ నంబర్‌ జారీ కాలేదన్నారు.ప్రయాణం వివరాలు అందడంతో సమన్వయం చేసుకుని కోల్‌కతా నుంచి నంబర్‌ను పొందామని, ఈ క్రమంలో దాదాపు 25 నిమిషాల ఆలస్యం జరిగిందని చెప్పారు. కాగా, క్లియరెన్స్‌ ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలేదని బిజూ జనతా దళ్‌ నాయకుడు చిన్మయ్‌ సాహు ఆరోపించారు.

ఈపీఎఫ్‌ పింఛన్‌ రూ.7,500 మంజూరు చేయాలి1
1/1

ఈపీఎఫ్‌ పింఛన్‌ రూ.7,500 మంజూరు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement