కొరాపుట్‌లో ‘కామ్రేడ్ కళ్యాణ్’ షూటింగ్
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో కామ్రేడ్ కళ్యాణ్ తెలుగు సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని శబరి శ్రీ జగన్నాథ క్షేత్రంలో పలు దృశ్యాలు చిత్రీకరించారు. హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ మహిమా నంబియర్ మధ్య సన్నివేశాలు తీశారు. జిల్లాలో 13 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. చిత్ర యూనిట్‌కి ప్రభుత్వపరంగా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ స్థానిక పోలీసులు హడావిడి చేయడం పట్ల షూటింగ్ సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. ఈ సినిమాకి నిర్మాతగా కోన వెంకట్, దర్శకుడిగా జానకిరామ్, సంగీత దర్శకుడిగా రఘు వాసన్ వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే రాజమౌళీ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఎస్‌ఎస్‌ఎంబీ చిత్రం, ఘాటీ, సంక్రాతికి వస్తున్నాం వంటి చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. మరి కొన్ని చిత్రాలు షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
కొరాపుట్‌లో ‘కామ్రేడ్ కళ్యాణ్’ షూటింగ్
కొరాపుట్‌లో ‘కామ్రేడ్ కళ్యాణ్’ షూటింగ్


