వేడుకగా మహిషాసుర మర్దిని ఆలయ పునఃప్రతిష్ట
పర్లాకిమిడి: మహిషాసుర మర్దిని ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం స్థానిక 16వ వార్డు గొల్ల మేదరవీధిలో ఘనంగా జరిపారు. హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ తిరుపతి పాణిగ్రాహి, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, వైస్ చైర్మన్ లెంక మధు, మాజీ సమితి చైర్మన్ సి.హెచ్.సింహాద్రి తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏటా దసరా ఉత్సవాలకు ఘనంగా ఇక్కడి ప్రజలు మొక్కులు తీర్చుకుంటారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన మహిషాసుర మన్దిని ఆలయం గతంలో పల్లికల వంశీయులు నెలకొల్పారు. అనంతరం 1974 మరికొందరు భక్తులు ముందుకు వచ్చి ఆలయ మరామ్మతులు చేపట్టారు. ప్రస్తుతం ఎన్ని ముఖలింగం వంశీయులు, గొల్లవీధి, మేదరవీధి, గొల్లకంజా వీధి, సంజయ్ గాంధీ కాలనీ వాసులు పల్లికల వంశీయులు కలిసి ఆలయం పూర్తిగా నిర్మించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పునః ప్రతిష్టలో భాగంలో పండితులు భాస్కరభట్ల రవిప్రసాద్ శర్మ, జోస్యుల ప్రతీప్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో సీతారాం రెడ్డి తదితరులు ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమాలుజరిగాయి. కార్యక్రమాన్ని ఎన్ని శేఖర్, గొల్లవీధి యూత్ కమిటీ ఆఽధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు.


