ముగిసిన తరుణ ప్రజ్ఞా భారతి వార్షికోత్సవ పోటీలు
జయపురం: ప్రాచీన సంస్కృతి, కళలు, క్రీడలు, మొదలగు సంప్రదాయాల పరిరక్షణకు ఉద్యమిస్తున్న జయపురం తరుణ ప్రజ్ఞా భారతి సంస్థ తన వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలు ఆదివారంతో ముగిశాయి. స్థానిక ఎన్‌కేటీ రోడ్డు నారాయణి ఆంగ్ల పాఠశాల క్రీడా మైదానంలో పోటీలు జరిగాయి. పరుగు, విలు విద్య, సైకిల్ రేస్, శిశు పాటలు, స్కిప్పింగ్, కప్పగెంతుల పోటీలను నిర్వహించగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజ్ఞా భారతి అధ్యక్షులు తపన కిరణ్ త్రిపాఠీ ప్రసంగిస్తూ.. మన ప్రాచీన సంప్రదాయ కళలు, ఆచారాలు, సంస్కృతి పరిరక్షణ ప్రధాన లక్ష్యంతో తరుణ ప్రజ్ఞా భారతి ఏర్పాటైందన్నారు. ఏటా ప్రాచీన సంప్రదాయాలపై విద్యార్థులక, ప్రజలకు పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ నెల తొమ్మిదో తేదీన స్థానిక తరణీ కూడలి వద్దగల విజ్ఞాన ప్రాధమిక పాఠశాలలో మన శాసీ్త్రయ ఒడిస్సీ నృత్యం, జానపద నృత్యాల పోటీలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోటీల నిర్వహణలో ప్రజ్ఞా భారతి ఉపాధ్యక్షులు రామ శంకర షొడంగి, కార్యదర్శి అజయ కుమార్ మల్లిక్, కోశాధికారి రవీంద్రమహరాణ, సభ్యులు జానకీ పాణిగ్రహి, సబిత త్రిపాఠీ, లిపిక దొలాయి, సుర్ణ ఖిళో, సంగీత కళాకారుడు జి.మహేష్, తపంజనీ కుమారి సాహు, జగన్నాథ్ పాణిగ్రహి పాల్గొన్నారు.
ముగిసిన తరుణ ప్రజ్ఞా భారతి వార్షికోత్సవ పోటీలు
ముగిసిన తరుణ ప్రజ్ఞా భారతి వార్షికోత్సవ పోటీలు
ముగిసిన తరుణ ప్రజ్ఞా భారతి వార్షికోత్సవ పోటీలు


