ఉత్సాహంగా 5కే రన్
జయపురం: జయపురం పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కోసం 5కే రన్‌ను సోమవారం నిర్వహించారు. స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయం క్రీడా మైదానం నుంచి సైబర్ సురక్షా మారథాన్ బయలు దేరి పట్టణంలో పలు వీధుల గుండా సాగిన రన్ తిరిగి విశ్వవిద్యాలయ క్రీడా మైదానానికి చేరుకుంది. రన్‌లో రెండు వందలకు పైగా యువకులు, విద్యార్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా జయపురం సబ్‌కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి, గౌరవ అతిథులుగా సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్రరౌత్, సదర్ పోలీసు అధికారి సచిన్ ప్రధాన్, బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురుదొర బర్తియ పాల్గొన్నారు. సబ్‌కలెక్టర్ ప్రసంగిస్తూ.. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మారథన్ పోటీలలో పురుషులలో దిలీప్ ఖొర, గోపాల గోండ్, ఫిలిఫ్ భొత్రలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలవగా, ధనుర్జయ రెడ్డి, యురింగమ్ మీనక కన్సొలేషన్ బహుమతులు పొందారు. మహిళల గ్రూపులో దమయంతి హరిజన్, పూర్ణ మల్లిక్, సంగమ్మ మఝి మొదటి మూడు స్థానాల్లో నిలవలగా.. స్వాతి జాని, భాగ్యలక్ష్మి ఖిలోలు కన్సోలేషన్ బహుమతులు పొందారు. సీనియర్ సిటిజన్ల గ్రూపులో కృష్ణ చంద్ర హత్త, సురేష్ కుమార్ హత్త, లక్ష్మీపాఢీ ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. మారథాన్‌లో పాల్గొన్న చిన్నారులలో బిభుతి మహరాణ, పి.తేజ్ కిరణ్, గోపీనాథ్ సాహు, సుభాిశిష సాహు, టి.హరి, శివ ప్రసాద్ పాఢీ, గంగా సాగర్, రిహంత మహరాణ, నిరంజన్ సాహు ప్రత్యేక బహుమతులు పొందారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వేదికపై నాటికలు ప్రదర్శించారు.
ఉత్సాహంగా 5కే రన్
ఉత్సాహంగా 5కే రన్
ఉత్సాహంగా 5కే రన్
ఉత్సాహంగా 5కే రన్


