శిశు సంరక్షణ సాధ్యం
న్యూస్‌రీల్
గవర్నర్ డాక్టర్ హరిబాబు
కంభంపాటి
మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025
సామాజిక స్పృహతో..
భువనేశ్వర్:
బాలల పౌష్టిక పోషణ, సంరక్షణతో ఒక దేశం యొక్క ఆరోగ్యం, తెలివితేటలు బలంగా ముడిపడి ఉంటాయని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. నగరంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఒడిశా రాష్ట్ర చాప్టర్ నిర్వహించిన శిశు, చిన్న పిల్లల పోషణ (ఐవైసీఎఫ్) చాప్టర్ 15వ జాతీయ సమావేశం, హ్యూమన్ మిల్క్ బ్యాంక్ (హెచ్‌ఎంబీ) అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క 11వ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవితంలోని శిశు దశ ప్రాముఖ్యత దృష్ట్యా గర్భం దాల్చినప్పటి నుంచి రెండో పుట్టిన రోజు వరకు మొదటి 1,000 రోజులు శారీరక పెరుగుదల, మెదడు అభివృద్ధి, జీవితాంతం శ్రేయస్సు కోసం అత్యంత కీలకమైన కాలమని అన్నారు. శిశువులు, చిన్న పిల్లల పోషకాహారంలో పెట్టుబడి కేవలం వైద్యపరమైన సమస్య పరిష్కారానికి పరిమితం కాకుండా సామాజిక విధిని కూడా రూపొందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇతర శిశువుల పోషణకు నిస్వార్థంగా చనుబాలను దానం చేసే తల్లులను గవర్నర్ ప్రశంసించారు. జాతీయ ఆరోగ్య మిషన్ మరియు కమ్యూనిటీ ఔట్‌రీచ్ కార్యక్రమాల కింద ఒడిశా చొరవలను ప్రస్తావిస్తూ, తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణలో రాష్ట్రం సుస్థిర పురోగతిని సాధించిందని డాక్టర్ కంభంపాటి అన్నారు. ప్రతి నవజాత శిశువుకు తగిన పోషణ, సంరక్షణ, భద్రత కల్పించేందుకు ఈ చొరవ దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంబీ కార్యదర్శి డాక్టర్ కన్యా ముఖోపాధ్యాయ, ఐవైసీఎఫ్ కార్యదర్శి డాక్టర్ జై సింగ్, వైజ్ఞానిక కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ బ్రజ కిషోర్ బెహరా, సహ సంస్థ కార్యదర్శి డాక్టర్ పార్థిక్ దే మాట్లాడారు.
శిశు సంరక్షణ సాధ్యం
శిశు సంరక్షణ సాధ్యం


