జయపురం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీని ఆదివారం జయపురంలో నిర్వహించారు. ముఖ్యఅతిదిగా ఛతీస్‌గఢ్ రాష్ట్ర బస్తర్ జిల్లా సద్భావణ కమిటీ నేత రాజ బహుదూర్ సింగ్ రాణా, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్ పరిచాలకులు మానసింగ్ ఘుయురియ పాల్గొన్నారు. ముఖ్యఅతిథి రాజబహుదూర్ సింగ్ ప్రసంగిస్తూ.. ఆర్‌ఎస్‌ఎస్ ఏ జాతికి, మతానికి ప్రాధాన్యత ఇవ్వదన్నారు. అన్ని వర్గాలు, అన్ని మతాలకు చెందిన వారు ఇందులో చేరవచ్చునన్నారు. దేశ నిర్మాణంలో భాగస్వాము కావాలనుకునేవారంతా ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. స్థానిక దసరా పొడియాలో ప్రారంభమైన ర్యాలీ పారాబెడ, గోపబందు నగర్, భద్రయ్య వీధి, బెల్ రోడ్డు, నీలకంఠేశ్వర మందిరం రోడ్డు, లాల్‌సాహి, సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గ్ మీదుగా తిరిగి దసరా పోడియానికి చేరుకుంది. అక్కడ జరిగిన సభలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు పాల్గొని మాట్లాడారు.
సందడిగా ఆర్‌ఎస్‌ఎస్ శత జయంతి ఉత్సవాలు
సందడిగా ఆర్‌ఎస్‌ఎస్ శత జయంతి ఉత్సవాలు
సందడిగా ఆర్‌ఎస్‌ఎస్ శత జయంతి ఉత్సవాలు
సందడిగా ఆర్‌ఎస్‌ఎస్ శత జయంతి ఉత్సవాలు


