అవినీతిపై సామూహిక పోరాటం చేద్దాం
జయపురం: దేశ ప్రగతికి అడ్డుగా నిలుస్తున్న అవినీతిపై సామూహిక పోరాటం చేద్దామని జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి పిలుపునిచ్చారు. కొరాపుట్ విజిలెన్స్ డివిజన్ జయపురం ఆధ్వర్యంలో అవినీతి నిరోధక వారోత్సవాల ముగింపు సందర్భంగా జయపురంలో సచేతన ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. అవినీతిని అంతమొందించాలంటే ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ప్రజల పనులు చేయడం ఉద్యోగుల కర్తవ్యమని స్పష్టం చేశారు. పనులు చేసేందుకు లంచాలు అడగడం, ఇవ్వడం కూడా నేరమన్నారు. విజిలెన్స్ ఎస్పీ రవీంద్ర కుమార్ పండా మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు 33 అవినీతి కేసులు కొరాపుట్ విజిలెన్స్ డివిజన్‌లో నమోదయ్యాయని వెల్లడించారు. ఎటువంటి అవినీతిని విజిలెన్స్ సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్ తదితరులు పాల్గొన్నారు.


