పురిటిగూడలో పత్రికొమ్మల పండుగ | - | Sakshi
Sakshi News home page

పురిటిగూడలో పత్రికొమ్మల పండుగ

Oct 2 2025 8:41 AM | Updated on Oct 2 2025 8:41 AM

పురిట

పురిటిగూడలో పత్రికొమ్మల పండుగ

పర్లాకిమిడి: కాశీనగర్‌ సమతి పురిటిగూడ గ్రామంలో దసరా వేడుకలు సందర్భంగా రైతులు పత్రికొమ్మల పండుగను బుధవారం జరుపుకున్నారు. పత్రికొమ్మలను అమ్మవారి మందిరానికి తీసుకువచ్చి అక్కడ కోళ్లు, మేక పోతులను బలిచ్చి ఆ రక్తాన్ని పత్రికోమ్మలకు తడుపుతారు. దీనిని పత్రికొమ్మల దసరా అని పిలుస్తారు. ఆ కొమ్మలను పంటపొలాల్లో నాటుతారు. ఆకులకు ఉన్న రక్తంతో పొలంలో కీటకాలు నాశనం అవుతాయని, పంటలు బాగా పండుతయని అన్నదాతల విశ్వాసం. పత్రికొమ్మల దసరా వేడుకల్లో బీజేపీ నాయకులు రోక్కం సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐదు వందల కిలోల

గంజాయి పట్టివేత

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్‌ పంచాయతీ పర్కన్‌మాల అటవీప్రాంతంలో అక్రమ రవాణాకు సిద్ధం చేసిన గంజాయిని మంగళవారం రాత్రి బలిమెల పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అడవిలో ఉన్న గంజాయి గురించి బలిమెల ఐఐసీ దీరాజ్‌ పట్నాయక్‌కు విశ్వాసనీయవర్గాల నుంచి ఫోన్‌ సమాచారం వచ్చింది. దీంతో తన సిబ్బందితో మంగళవారం రాత్రి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల రాకను గమనించిన గంజాయి ముఠా పరారైంది. ఓ చోట ఉన్న 20 బస్తాలను స్వాధీనం చేసుకొని పరిశీలించగా వాటిలో భారీగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వీటిని పోలీస్‌స్టేషన్‌ తరలించారు. బుధవారం ఉదయం తూకం వేయగా 500 కిలోలు ఉందని.. దీని విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని ఐఐసీ దీరాజ్‌ పట్నాయక్‌ తెలిపారు. కేసు నమోదు చేసి గంజాయి అక్రమ రవాణాలో పాత్రదారులను గుర్తిస్తామన్నారు.

కారు దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు

రాయగడ: జిల్లాలోని గుడారి పోలీసులు మంగళవారం కారు దొంగతనం కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 22వ తేదీన గుడారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టుబుని గ్రామానికి చెందిన జష్య పాలక అనే వ్యక్తి తన సొంత కారును టుబుని ఆస్పత్రి సమీపంలో పార్కింగ్‌ చేసి విశాఖపట్నం వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వచ్చి చూడగా కారు కనిపించకపోవడంతో చోరీ జరిగి ఉంటుందని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి మంగళవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి గుణుపూర్‌ కోర్టుకు తరలించారు.

ఫుట్‌బాల్‌ టోర్నీ విజేతగా సోలిన్‌ సాకర్‌ జట్టు

పర్లాకిమిడి: గజపతి స్టేడియంలో సెప్టెంబర్‌ 28 నుంచి జరుగుతున్న జిల్లా స్థాయి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ విజేతగా సోలిన్‌ సాకర్‌ జట్టు నిలిచింది. ఫైనల్‌ పోరులో బ్లూ టైటాన్‌ జట్టుపై విజయం సాధించింది. అంతర్జాతీయ క్రీడాకారుడు కిషోర్‌చంద్ర రథ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు. పోటీలను ఆదిత్యకార్జి, పవన్‌ పట్నాయిక్‌, ఆదిత్య బెహరా పర్యవేక్షించారు.

పురిటిగూడలో పత్రికొమ్మల పండుగ 1
1/2

పురిటిగూడలో పత్రికొమ్మల పండుగ

పురిటిగూడలో పత్రికొమ్మల పండుగ 2
2/2

పురిటిగూడలో పత్రికొమ్మల పండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement