
అదరహో..!
భువనేశ్వర్ నగరంలో ఎక్కడిక్కడ అబ్బురపరిచే పూజా మంటపాలు సందర్శకుల్ని కట్టిపడేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక, ధార్మిక, పుణ్య క్షేత్రాల్ని ప్రతిబింబించేలా నిలువెత్తు తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. స్థానిక వీఎస్‌ఎస్ నగర్ దుర్గా పూజ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం జగన్నాథుని రథం నందిఘోష్ నమూనాతో దుర్గా పూజా తోరణం తీర్చిదిద్దారు. రసూల్‌ఘడ్ ప్రాంతంలో ఉత్తరాఖండ్ దేవ భూమి క్షేత్రం రూపొందించారు. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగర పోలీసు కమిషనరేటు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
– భువనేశ్వర్

అదరహో..!

అదరహో..!

అదరహో..!