
పిడుగుపాటుకు పశువుల మృతి
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధిలో రుపుణి గ్రామంలో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఐదు పశువులు మృత్యువాతపడ్డాయి. భీమ మండంగి, గుబేయ పలకలకు చెందిన పశువులు మేతకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చేసుకుంది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. కేఎన్‌కే సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని ఆటోలొ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కండ్రవీధికి చెందిన ఇప్పిలి గౌరిగా గుర్తించారు. ఇంకా కేసు నమోదు కాలేదు.

పిడుగుపాటుకు పశువుల మృతి