
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ దశాబ్దాలుగా నేటికీ అనేక ఇళ్లల్లో భక్తులు పలు రకాల బొమ్మల్ని సందేశాత్మకంగా కొలువుదీర్చుతున్నారు. వివిధ రకాల బొమ్మతో ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంటున్నారు. బొమ్మల నడుమ కొలువుదీరిన దుర్గా మాతకు నిత్యం ఆరాధించి పలు రకాల నైవేద్యాలు సమర్పిస్తున్నారు. కొలువు సందర్శనకు విచ్చేసే ముత్తయిదువలకు తాంబూలం సమర్పించి శుభం కలగాలని దేవిని వేడుకుంటున్నారు. కటక్, భువనేశ్వర్ జంట నగరాల్లో తెలుగింటి బొమ్మల కొలువు దసరా సంబరాల్ని ద్విగుణీకృతం చేస్తోంది. ఈ ఏడాది కటక్ నగరంలో వి.రాజేశ్వరి, సీహెచ్ కుసుమ భువనేశ్వర్‌లో భానుమతి బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. విజయ దశమితో వీరు ఏర్పాటు చేసిన కొలువుని ముగిస్తారు. వీరంతా పూర్వీకుల నుంచి అలవరచుకున్న ఆచారం ప్రకారం ఏటా క్రమం తప్పకుండా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తుండడం విశేషం. మిగిలిన ప్రాంతాల్లోనూ బొమ్మల కొలువులతో సందడి నెలకొంది.
– భువనేశ్వర్

గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025