
ప్రిన్సిపాల్ జితేంద్రనాథ్‌కు ఘనంగా వీడ్కోలు
పర్లాకిమిడి: స్థానిక శ్రీక్రిష్ణచంద్రగజపతి స్వయం ప్రతిపత్తి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జితేంద్రనాథ్ పట్నాయక్ బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రొఫెసర్లు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు తెలిపారు. గత అయిదేళ్లలో కళాశాలలో అనేక విభాగాల్లో పోస్టుల భర్తీకి బరంపురం విశ్వ విద్యాలయానిక సిఫారసు చేశారు. అంతేకాక పలువురుకి కాంట్రాక్టు పద్ధతిలో లెక్చరర్లను నియమించేందుకు పట్నాయక్ విశేషంగా కృషి చేశారు. పచ్చదనం కోసం కళాశాల ఆవరణలో అనేక మొక్కలను నాటించారు. ఆయనకు కన్వీనరు రధాకాంత భుయ్యాన్, డాక్టర్ ఎం.రహమాన్ తదితరులు కేక్‌ను కోసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రిన్సిపాల్ జితేంద్రనాథ్‌కు ఘనంగా వీడ్కోలు