
డొంబొసొరోను సమితిగా గుర్తించాలి
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సమితి పరిధి డొంబొసొరా పంచాయతీని సమితిగా గుర్తించాలని పంచాయతీకి చెందిన ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సమితి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అభివృద్ధి దిశగా పయనిస్తున్న డొంబొసొరొ పంచాయతీని సమితిగా గుర్తిస్తే మరింత అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మౌలిక సౌకర్యాలు చేకూరుతాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను సమితులుగా గుర్తిస్తున్న నేపథ్యంలో తమ ప్రాంత డొంబొసొరో పంచాయతీని సమితిగా గుర్తించాలని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటికై నా స్పందించి సమితిగా గుర్తించాలని వారంతా కోరారు.