
ఘనంగా శ్రీకృష్ణ జయంతి
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు సోమవార ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో రాధా కాంతులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కుంకుమ, తులసీ దళాలతో అర్చనలు చేశారు. అనంతరం భాగవత, విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించారు. అదేవిధంగా ఉట్టు కొట్టే కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షుడు చంద్రమౌళి కుముందాన్, కార్యదర్శి రాఘవ కుముందాన్, శ్రీనివాస్ కుముందాన్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీకృష్ణ జయంతి