
విస్తృతంగా వాహన తనిఖీలు
జయపురం: పట్టణ పోలీసులు నింబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాహనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్రరౌత్ ఆదేశాల మేరకు జయపురం మెయిన్‌రోడ్డు, పోలీసుస్టేషన్ ముందు 26వ జాతీయ రహదారిపై వాహన తనిఖీలు మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా అధిక శబ్ధం చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్న 28 బైక్‌లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి మోటారు వెహికల్ చట్టం ప్రకారం జరిమానాలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వాటి సైలెన్సర్లను తొలగించి రోలర్‌తో తొక్కించారు. రోడ్లపై న్యూసెన్స్ సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పర్యాటకుడు సురక్షితం
భువనేశ్వర్: పూరీ సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక పర్యాటకుడు మునిగిపోయాడు. ఉప్పొంగిన కెరటాల్లో కొట్టుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యం తీరంలో పహారా కాస్తున్న లైఫ్ గార్డుల దృష్టికి రావడంతో తక్షణమే సముద్రంలోకి దూకి ఆదుకున్నారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పూరీ సాగర తీరం 9వ నంబర్ సెక్టారులో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. లైఫ్ గార్డుల సాయంతో ప్రాణాలతో ఒడ్డుకు చేరిన పర్యాటకుడు కెంజొహర్ ప్రాంతానికి చెందిన వికాస్ నాయక్‌గా గుర్తించారు.
పోగొట్టుకున్న సెల్‌ఫోన్
అందజేత
రాయగడ: జిల్లాలోని టికిరి జగన్నాథ మందిరం సమీపంలో రోడ్డుపై దొరికిన సెల్‌ఫోన్‌ను బాధితుడికి పోలీసుల సమక్షంలో అప్పగించి ఒక వ్యక్తి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. నయాగడ జిల్లా బెగునియాపట్న ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ రవుత్ అనే వ్యక్తి టికిరి గ్రామంలో జరిగే అగ్ని భైరవ ఉత్సవాలను తిలకించేందుకు ఆదివారం వచ్చాడు. ఈ క్రమంలో ఉత్సవాలను తిలకించే సమయంలో తనకు జగన్నాథ మందిరం సమీపంలో ఒక సెల్‌ఫోన్ దొరికింది. దీంతో దొరికిన సెల్‌ఫోన్‌ను సోమవారం పోలీసులకు అప్పగించాడు. అయితే అప్పటికే తన సెల్‌ఫోన్ పోయినట్లు ఉషాపాడు గ్రామానికి చెందిన శ్రీకాంత్ బిడిక అనే వ్యక్తి టికిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసుల సమక్షంలో పోగొట్టుకున్న బాధితుడికి అప్పగించారు.
బడులకు వెళ్దాం రండి
జయపురం: జయపురం సబ్ జైలు రోడ్డులో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంగళవారం 8వ వార్డులో రండి బడులకు వెళ్దాం అభిజాన్‌లో ర్యాలీ మంగళవారం నిర్వహించారు. బడులకు వెళ్దాం.. బాగా చదువుదాం, మంచి రాష్ట్రాన్ని నిర్మిద్దాం అనే నినాదాలు చేశారు. జైలు రోడ్డు, నెహ్రూ నగర్, మహాత్మాగాంధీ రోడ్డు, పీడబ్ల్యూడీ లైన్, డెప్పిగుడ మొదలగు ర్యాలీ చేపట్టారు.

విస్తృతంగా వాహన తనిఖీలు

విస్తృతంగా వాహన తనిఖీలు

విస్తృతంగా వాహన తనిఖీలు