
పవర్ ప్లాంట్ వద్దు.. పర్యావరణం ముద్దు
బూర్జ: పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా బహిరంగ సభను విజయవంతం చేయాలని పోరాట కమిటీ సమన్వయకర్త యోబ యోగి, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్ దొర ఆదివాసీలకు పిలుపునిచ్చారు. మంగళవారం పోరాట కమిటీ సభ్యులు పిలుపు మేరకు తిమడాం గ్రామంలో సమావేశం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22న అడ్డూరిపేటలో జరిగే బహిరంగ సభకు అందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.