
పారిశుద్ధ్య సమస్య పట్టించుకోరా?
జలుమూరు: పారిశుద్ధ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం అందవరం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. అందవరం, రామకృష్ణాపురం, గొల్లపేట గ్రామాల్లో రోడ్డుపైనే మురుగునీరు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దోమలు వ్యాప్తి చెంది అంటురోగాల బారినపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలైట్లు కూడా వెలగడం లేదని, ఇసుక లారీల వల్ల రోడ్డు గోతులమయంగా మారిందని వాపోయారు. విషయం తెలుసుకున్న పంచాయతీ విస్తరణ అధికారి ఉమామహేశ్వరరావు గ్రామస్తులతో మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు.
గంజాయితో ఇద్దరి అరెస్టు
పలాస: ఒడిశా రాష్ట్రం జగిదిపదర్ గ్రామానికి చెందిన హేమంత్ సబర్, కేశబ్‌సబర్‌లు పలాస రైల్వేస్టేషన్ రోడ్డులో మంగళవారం అనుమానాస్పదంగా తిరగడంతో పట్టుకొని తనిఖీ చేయగా గంజాయి బయటపడిందని కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. మూడు ప్యాకెట్లలో ఉన్న 16.845 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. నిందితులను పలాస కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. ఒడిశా రాష్ట్రం రాజ్‌బోసా గ్రామానికి చెందిన అముస్ అలియాస్ జూన్‌హేన్సన్ వద్ద గంజాయి తీసుకుని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సంజురైతో అనే వ్యక్తికి ఇచ్చేందుకు వీరు వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. పలాస రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని కాశీబుగ్గ ఎస్‌ఐ ఆర్.నరసింహమూర్తి సిబ్బందితో కలిసి పట్టుకున్నారని సీఐ చెప్పారు. గంజాయితో పాటు సెల్‌ఫోన్, రూ.3,650 నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నీట్ పీజీ ఫలితాల్లో
మెరిసిన విశాల్
బాలుడు అదృశ్యం
21న నవయువ కవితా మహోత్సవం
శ్రీకాకుళం కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, విశ్వసాహితీ కళావేదిక, ఆంధ్ర సారస్వత పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ నెల 21న శ్రీకాకుళం నవ యువ కవితా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఈవేమన, జంధ్యాల శరత్‌బాబు, భమిడిపాటి గౌరీశంకర్ తెలిపారు. మునసబుపేటలోని గురజాడ విద్యా సంస్థల ఆవరణలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఉత్సవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో అంబేడ్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి కె.రజిని, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.వి.జి.డి.బాలాజీ, గురజాడ సంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు, విశ్వసాహితీ కళావేదిక అధినేత కొల్లి రమావతి పాల్గొంటారని వివరించారు.

పారిశుద్ధ్య సమస్య పట్టించుకోరా?

పారిశుద్ధ్య సమస్య పట్టించుకోరా?

పారిశుద్ధ్య సమస్య పట్టించుకోరా?