
ఉత్సాహంగా సాఫ్ట్ టెన్నిస్ పోటీలు
పాతపట్నం: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17, అండర్–19 బాల, బాలికల సాఫ్ట్ టెన్నిస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు పాతపట్నం మండలం సూర్యనారాయణపురం గ్రామ సమీపంలోని అక్షర పాఠశాల మైదానంలో ఉత్సాహంగా జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన 270 మంది విద్యార్థులు హాజరయ్యారని రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్‌బాబు తెలిపారు. కొందరు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈవో సీహెచ్ తిరుపతిరావు, డైరెక్టర్ రియాజ్, ప్రిన్సిపాల్ సుజాత, పీఈటీలు కె.రాజారావు, జె.కృష్ణ, ఎస్.కృష్ణారావు, లోకేశ్వరరావు, డి.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.