
కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు పటిష్ట భద్రత
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండల కేంద్రంలో గల కొత్తమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం అయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌తో కలసి అలయ ప్రాంగణం పరిశీలించారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, రెవెన్యూ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.