
నిరసన గళం
బాకై ్సట్ తవ్వకాలపై..
● తవ్వకాలు ఆపాలని ప్రజల డిమాండ్
● లక్ష్మీపూర్‌లో భారీ ర్యాలీ
రాయగడ: కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్‌లో వేదాంత కంపెనీ ద్వారా జరుగుతున్న కొడింగమాలి బాకై ్సట్ తవ్వకాలను నిలిపివేయాలని ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం నాడు వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా లక్ష్మీపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయగడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పండ నేతృత్వంతో జరిగిన ఈ ర్యాలీలో లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర సామంత, రాయగడ శాసనసభ మాజీ ఎమ్మెల్యే మకరంద ముదులి, కొరాపుట్ జిల్లా బీజేడీ అధ్యక్షుడు జిన్ను హికక, కొడింగమాలి సురక్షా సమితి సభ్యులు, బాధిత గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదాంత కంపెనీ కొనసాగిస్తున్న బాకై ్సట్ తవ్వకాలను నిలిపివేయాలని ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీపూర్‌లో గల ఒడిశా మైనింగ్ కార్యాలయం(ఔంసి) ఎదుట నిరసన తెలియజేశారు.
కర్మాగారం ఏర్పాటైతేనే..
వేదాంత కంపెనీ గత కొద్ది ఏళ్లుగా కొడింగిమాలిలో గల బాకై ్సట్ నిక్షేపాలను తవ్వుకుని వెళ్లిపోతోందని, అయితే కర్మాగారం ఏర్పాటైన తర్వాత తవ్వకాలను కొనసాగిస్తే బాగుండేదని కానీ ఎలాంటి కర్మాగారాన్ని ఏర్పాటు చేయకుండా బాకై ్సట్ నిక్షేపాలను తవ్వుకుంటూ పోతే పర్యావరణం కలుషితం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు దూరమవుతాయని రాయగడ మాజీ ఎమ్మెల్యే మకరంద ముదులి అన్నారు. ఇప్పటికే 3 మిలియన్ల మెట్రిక్ టన్నుల బాకై ్సట్‌ను తవ్వేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారని, మరో 6 మిలియన్ల టన్నుల బాకై ్సట్‌ను తవ్వుకునేందుకు ప్రభుత్వంతో ఒప్పందానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. కర్మాగారం ఏర్పాటైతేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, కానీ కర్మాగారం ఏర్పాటు కాకుండా ఇలా బాకై ్సట్ నిక్షేపాలను తవ్వుకుపోవడం సరికాదని అన్నారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం కొడింగిమాలి బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి సరైన చర్యలు తీసుకుని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలే తప్ప వేదాంత కంపెనీతో లాలూచీ పడి ఒప్పందం కుదుర్చుకుంటే తామంతా కలసి తవ్వకాలను అడ్డుకుంటామని డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పండ అన్నారు. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల కోసం ప్రభుత్వం కృషి చేయాలే తప్ప జిల్లాలో ఉన్న ఖనిజ సంపదను ధారాదత్తం చేస్తే సహించబోమని తెలిపారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసీ, హరిజన ప్రజలతో గల కొరాపుట్, రాయగడ జిల్లాల్లో పరిశ్రమ ఏర్పాటుతోనే సమగ్రాభివృద్ధి జరుగుతుందని కొరాపుట్ జిల్లా బీజేడీ అధ్యక్షుడు, కొరాపుట్ లొక్‌సభ మాజీ సభ్యులు జిన్ను హికక అన్నారు. పరిశ్రమల ఏర్పాటును తామెప్పుడూ వ్యతిరేకించలేదని, ఖనిజ సంపదలను ఇలా దుర్వినియోగం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మిగిలేది మట్టి మాత్రమేనని అన్నారు.
కొడింగిమాలిలో సుమారు 428 హెక్టార్ల విస్తీర్ణంలో బాకై ్సట్ తవ్వకాలకు ప్రభుత్వం యోచిస్తోందని, అందులో భాగంగా రాయగడ జిల్లా పరిధిలో గల కాశీపూర్ ప్రాంతంలో 21 శాతం మిగతా కొరాపుట్ జిల్లాలొని లక్ష్మీపూర్ ప్రాంతంలో బాకై ్సట్ తవ్వకాలకు వేదాంత కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోందని ఓఎంసీ డిప్యూటీ జనరల్ మేనేజరు హేమంత కుమార్ బెహరా తెలియజేశారు.

నిరసన గళం

నిరసన గళం

నిరసన గళం

నిరసన గళం