
ఆరున్నర కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఇచ్ఛాపురం సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్ఛాపురం సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని గంజాం జిల్లా అస్కాకు చెందిన ప్రశాంత్‌కుమార్‌పాఢీ, బెర్హంపూర్‌కు చెందిన కందులు పూర్ణచంద్ర సెనాపతిలు అదే రాష్ట్రంలోని కందమాల్ జిల్లా టికాబలి గ్రామానికి చెందిన బపూని డిఘాల్ వద్ద గంజాయి కొనుగోలు చేశారు. బెంగళూరులోని ఓ వ్యక్తి అందజేసేందుకు బస్సులో ఇచ్ఛాఫురం చేరుకున్నారు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కి వస్తుండగా ఇచ్ఛాపురం పట్టణ పోలీస్‌లు తనిఖీలు చేపట్టి 6.600 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. తనిఖీల్లో పట్టణ ఎస్సై ముకుందరావు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.