
అథ్లెటిక్స్ సమరానికి వేళాయె
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఈనెల 27వ తేదీన జరగను న్నాయి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఎంపిక ల ప్రక్రియ మొదలుకానుంది. అథ్లెటిక్స్ అసో సియేషన్ రాష్ట్ర, జిల్లా చైర్మన్ కొన్న వెంకటేశ్వరావు(వాసు) సూచనల మేరకు జిల్లా అథ్లెటి క్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి నేతృత్వంలో జిల్లా సంఘ ప్రతినిధులు, పీడీ, పీఈటీలు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
నాలుగు వయో విభాగాల్లో పోరు..
సౌత్‌జోన్ నేషనల్స్‌లో పాల్గొనే అథ్లెటిక్స్ క్రీడా కారుల ఎంపికలు మొత్తం నాలుగు వయో విభాగాల్లో చేపట్టనున్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా 100 మీటర్ల పరుగుపందాలు, హర్డిల్స్, 200 400, 800, 1000, 2వేలు, 3వేలు, 5వేల మీటర్ల పరుగు పందాలు, నడక, లాంగ్‌జంప్, హైజంప్, ట్రిపుల్‌జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, హేమర్‌త్రో, పోల్‌వాల్ట్ తదితర అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో పోటీలు నిర్వహించి అందులో రాణించిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపిక చేయనున్నారు.
ఇక్కడ రాణిస్తే రాష్ట్ర పోటీలకు..
ఏపీ జూనియర్ స్టేట్‌మీట్(అంతర్‌జిల్లాల) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2025 పోటీలు బాపట్ల జిల్లా (చీరాల) వేదికగా ఆగస్ట్ 9 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఇక్కడ జరిగే ఎంపికల్లో రాణించిన అథ్లెట్లను బాపట్లలో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేయనున్నారు. అక్కడ మూడు రోజులపాటు పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేస్తారు. గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులు సౌత్‌జోన్ నేషనల్స్‌కు నేరు గా అర్హత సాధించనున్నారు. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు సౌత్‌జోన్ జూనియర్ నేషనల్స్ జరగనున్నాయి. క్రీడాకారులు వివరాల కో సం సంఘ జిల్లా కార్యనిర్వాహక కార్య దర్శి కె.మాధవరావు (9346903771)ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్
క్రీడాకారుల ఎంపిక పోటీలు
ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు రాష్ట్రపోటీలకు ఎంపిక
ప్రతిభే ఆధారంగా..
క్రీడాకారుల ప్రతిభే ఆధారంగా ఎంపికల ను నిర్వహిస్తాం. ఇక్కడ రాణించిన బాల బాలికలను బాపట్లలో జరిగే స్టేట్‌మీట్‌కు ఎంపిక చేస్తాం. అక్కడ రాణిస్తే సౌత్‌జోన్ నేషనల్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారు. – మెంటాడ సాంబమూర్తి,
అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
సద్వినియోగం చేసుకోవాలి
సౌత్‌జోన్ మీట్ షెడ్యూల్ వెలువడింది. 27న శ్రీకాకుళంలో జరిగే జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తమ ప్రతిభను నిరూపించుకోవాలి.
– కొన్న మధుసూదనరావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు

అథ్లెటిక్స్ సమరానికి వేళాయె

అథ్లెటిక్స్ సమరానికి వేళాయె