
కవితల పోటీల్లో అ‘ద్వితీయ’ ప్రతిభ
పర్లాకిమిడి: ఒడిశా సాహిత్య అకాడమీ తరఫున నిర్వహించిన కవితల పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్న స్థానిక గాంధీ మెమోరియల్ ప్రాథమిక ఉన్నత విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని జాస్మిన్ బోరాడో.. రాష్ట్రస్థాయిలోనూ ద్వితీయ స్థానం కై వసం చేసుకుంది. ఒడిశా సాహిత్య అకాడమీ 68వ స్వర్ణజయంతి వేడుకల (జూలై 25) సందర్భంగా భువనేశ్వర్‌లోని రవీంద్ర మండపంలో ఏర్పాటుచేసిన సభలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ చేతులమీదుగా జాస్మిన్ బోరాడోకు బహుమతి ప్రదానం చేశారు.