
భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవారం పూజలు
పర్లాకిమిడి: పట్టణంలో తొలి శ్రావణ శుక్రవారం పూజలను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉమారామలింగేశ్వర మందిరంలో పార్వతీదేవి మందిరంలో భక్తులు కుంకుమపూజలు చేశారు. ముత్తయిదవలకు పసుపు, కుంకుమ పెట్టి, దక్షిణ తాంబూలాలు అందించారు. లలితా దేవి అమ్మవారి వద్ద భక్తులు పండ్లు, పువ్వులతో పూజించారు. కొత్త బస్టాండ్ వద్ద వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కుంకుమపూజలను అర్చకులు వనమాలి మణిశర్మ మహిళలతో నిర్వహించారు.
రాయగడలో..
రాయగడ: శ్రావణ మాసం మొదటి శుక్రవారం మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీనగర్‌లో గల వేంకటేశ్వర కళ్యాణ మండపంలో లక్ష కుంకుమ పూజలు చేశారు. కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు జరిగాయి. శ్రావణ మాసం విశిష్టతను ఈ సందర్భంగా భాస్కరాచార్యులు భక్తులకు వివరించారు. అత్యంత పవిత్రమైన ఈ నెలలో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల సౌఖ్యాలు కలుగుతాయని వివరించారు.

భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవారం పూజలు