
ఒడిశా మహిళా కూలీ దుర్మరణం
కశింకోట: రోడ్డు ప్రమాదంలో ఒడిశా మహిళా కూలీ (54) దుర్మరణం చెందింది. అనకాపల్లి జిల్లా కశింకోట వద్ద శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీఐ అల్లు స్వామినాయుడు వివరాల ప్రకారం.. ఒడిశాలోని జైపూర్‌కు చెందిన కళావతి కొంతకాలంగా స్థానిక ఇటుకల బట్టీల్లో పని చేస్తోంది. ఈ క్రమంలో కశింకోట కూడలి వద్ద జాతీయ రహదారి దాటుతున్న ఆమెను బొలేరో వ్యాన్ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఇటుకల బట్టీ యజమాని ఇదగల మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన
పూరీ కలెక్టర్
దివ్య జ్యోతి పరిడా పూరీ జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం శ్రీ మందిరం సందర్శించి రత్న వేదికపై కొలువుదీరిన చతుర్థామూర్తుల్ని దర్శించుకుని ఆయన కార్యాలయంలో ప్రవేశించి బాధ్యతలు చేపట్టారు.
– భువనేశ్వర్/పూరీ
కలెక్టర్ పట్వారికి ఘనవీడ్కోలు
రాయగడ: జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారికి బదిలీ కావడంతో జిల్లా యంత్రాంగం ఆమెకు శుక్రవారం స్థానిక కలక్టర్ సమావేశం హాల్‌లో ఘనంగా వీడ్కోలు పలికారు. ఏడీఎం నిహారి రంజన్ కుహోరో ఆధ్వర్యంలో ఈ మేరకు నిర్వహించిన వీడ్కోలు సభలో ఆమె జిల్లాకు చేసిన సేవలను సిబ్బంది కొనియాడారు. అనంతరం దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. అనంతరం కలక్టర్ పట్వారి కార్యాలయం సిబ్బందితో గ్రూపుఫొటో దిగారు. తన విధుల్లో భాగంగా సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఆదివాసీ, హరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో కలెక్టర్‌గా తాను సేవలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ పిఎం చంద్రకాంత్ మాఝి తదితరులు పాల్గొన్నారు.
జీడి రైతుకు సత్కారం
కాశీబుగ్గ: వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్టు (ఓడీఓపీ) కార్యక్రమానికి జిల్లా పలాస జీడిపప్పు ఎంపికై న సందర్భంగా.. పారిశ్రామిక వేత్తలతో పాటు వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన రైతు యంపల్లి నారాయణను సత్కరించారు. ఆలిండియా కాష్యూ అసోసియేషన్ చైన్నె మహాబలిపురంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాష్యూ మాన్యుఫ్యాక్చర్ అసోసియేషన్ ఆహ్వా నం మేరకు రైతు వెళ్లారు. పలాస పరిసర ప్రాంతంలో ఉద్దానంలో రైతులు పండించిన జీడి పంట కారణంగా పేరుప్రఖ్యాతలు వచ్చాయ ని ఏపీసీఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లా కాంతారావు తెలిపారు.
అబ్బాయిపేటలో చోరీ
జలుమూరు: జోనంకి పంచాయతీ అబ్బాయిపేటకు చెందిన ఉప్పాడ నరసమ్మ ఇంటిలో దొంగతనం జరిగింది. చోరీలో రూ.60వేల విలువై న బంగారం పోయినట్లు ఆమె తెలిపారు. పది రోజుల కిందట ఆమె హరిదాసుపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉద యం తిరిగి వచ్చి చూసే సరికి బీరువా తెరిచి ఉంది. అందులో బంగారంతో పాటు కొన్ని వస్తువులు కనిపించలేదు.

ఒడిశా మహిళా కూలీ దుర్మరణం