
మౌలిక వసతులపై దృష్టి పెట్టండి: కలెక్టర్
బూర్జ: విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలో గల కొల్లివలస డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం విద్యాలయంలో శుక్రవారం జిల్లాలోగల అన్ని హాస్టళ్ల అనుబంధ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీరు, వసతులు, డార్మిటరీ గురించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కిటికీల వద్ద దోమ తెరలు అమర్చాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాఖల వారీగా హాస్టల్ జిల్లా అధికారుల తో సమీక్ష నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాలయాల ఎస్‌ఎం పురం, వమ్మరవెల్లి కళాశాల ప్రిన్సిపాల్స్, కేజీబీవీ విద్యాలయాల ఏపీసీ ఎస్.శశిభూషణరావు, ఏపీ మోడ ల్ విద్యాలయాలు ఏడీ శ్రీనివాసరావు, డిప్యూటీ ఈఓ కె.విజయకుమారి, కన్వీనర్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి జిల్లా ప్రజారవాణా అధికారి హనుమంతు అమరసింహుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి ఆగస్టు నెల 9వ తేదీ లోపు www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.