
జనావాసాల్లోకి జింక పిల్ల
రాయగడ: సదరు సమితి హలువ గ్రామంలో జింక పిల్ల జనావాసాల్లోకి వచ్చింది. సమీప అడవుల్లో నివసించే వన్యప్రాణులు తాగునీటి కోసం దగ్గరున్న నదీ తీర ప్రాంతాలకు వస్తుంటాయి. జింకపిల్ల మంగళవారం సాయంత్రం హలువ గ్రామంలోకి చొరబడింది. దీనిని చూసిన కొందరు పట్టుకునే ప్రయ త్నం చేశారు. అడవుల్లోకి పారిపోయినట్లు గ్రామస్తు లు చెప్పారు. ఈ విషయాన్ని రాయగడ అటవీ శాఖ రేంజర్ కామేశ్వర్ ఆచారి దృష్టికి తీసుకువెళ్లగా.. హలువ సమీప గ్రామాలు అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు ఇలా ఒకొక్కసారి తారసపడుతుంటాయన్నారు. ప్రజల నుంచి జింక పిల్లకు ఎటువంటి హాని కలగకుండా సమాచారం తెలిసిన వెంటనే సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించా మని చెప్పారు. సమీపంలో జంఝావతి నది ఉండటంతో ఒకొక్కసారి ఇటువంటి తరహా వన్యప్రాణు లు నీరు తాగేందుకు వచ్చి గ్రామస్తుల చేతిలో చిక్కు కుంటాయన్నారు. వాటిని మళ్లీ సురక్షింతంగా అడవుల్లోకి తరలిస్తుంటారన్నారు.