
బాలిక కుటుంబానికి ఓదార్పు
భువనేశ్వర్: ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న పూరీ జిల్లా నిమాపడా బొలొంగా గ్రామ బాలికని ఉప ముఖ్యమంత్రి ప్రతిభా పరిడా బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాలిక ఆరోగ్య పరిస్థితి, త్వరగా కోలుకునేందుకు కొనసాగిస్తున్న వైద్య, చికిత్స ప్రణాళిక కార్యాచరణ కోసం అనుబంధ వైద్య బృందంతో సంప్రదించారు. బాధిత బాలిక కుటుంబీకుల్ని ఓదార్చారు.
భువనేశ్వర్: ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న పూరీ జిల్లా బొలొంగా బాలికను కలిసి బిజూ జనతా దళ్ ప్రతినిధి బృందం పరామర్శించింది. ఆమె ప్రస్తుత ఆరోగ్యం గురించి ఈ బృందం సభ్యులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులను కలిసి అందుబాటులో ఉన్న సౌకర్యాలు తదితర ఏర్పాట్లు పరిశీలించారు.