
తహసీల్దార్ వాహనం అడ్డగింత
కొరాపుట్: కొట్‌పాడ్ తహసీల్దార్ ట్వింకిల్ శెఠిని మహిళా రైతులు దిగ్బంధించారు. మంగళవారం విధి నిర్వహణ అనంతరం తిరిగి వస్తుండగా బన్సలి గ్రామ రైల్వే గేటు వద్ద గేటు పడటంతో ఆమె తన వాహనం నిలుపుదల చేశారు. సమీపంలో ఉన్న పొలాల్లో పనిచేస్తున్న మహిళలు వేగంగా వచ్చి వాహనాన్ని దిగ్బంధించారు. ధాన్యం కొనుగోలు సమయంలో నిబంధనల పేరుతో క్వింటాలుకు 15 కేజీలు కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కొట్‌పాడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. అనంతరం రైతులు వామనం విడిచి పెట్టారు.
పేపర్ మిల్లు ఎదుట బైఠాయింపు
కొరాపుట్: జయపూర్ సమీపంలో గగనాపూర్ వద్ద సేవా పేపర్ మిల్ ప్రధాన గేటును దినసరి కార్మికులు మూసేశారు. బుధవారం మధ్యా హ్నం ముకుమ్మడిగా వెళ్లి గేట్లు మూసి బైఠాయించారు. దీంతో లోపల ఉన్న పేపర్ మిల్లు యాజమాన్య, సిబ్బంది చిక్కుకుపోయారు. గత కొంతకాలంగా తాము చేసిన పనికి వేతనా లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితం లేకపోవడంతో ఈ విధమైన ఆందోళనకి దిగా రు. ప్రస్తుతం పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిపి వేశారు. వందలాది కార్మికులకు వేతనాలు చెల్లించలేదని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి బయలుదేరారు.
ఎస్‌డీపీఓ కార్యాలయం ముట్టడి
జయపురం: సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి ఒటాగాంలో జరిగిన హత్యకు సంబంధించి నిందితులను అరెస్టు చేయాలని, మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగన్నాద్ కాశ్యప్ కార్యాలయాన్ని బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తు లు ముట్టడించారు. అనంతరం ఎస్‌డీపీఓకు వినతిపత్రం సమర్పించారు.
ఘనంగా బ్యాంక్ ప్రతిష్ట దినోత్సవం
జయపురం: బ్యాంక్ ఆఫ్ బరోడా 118వ ప్రతి ష్టా దినోత్సవాన్ని జయపురం శాఖలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ మేనే జర్ శ్రీరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ నేతృత్వంలో స్థానిక గోపాల గోసేవా వారి ద్వారా నిర్వహించబడు తున్న మహర్షి సందిపాణి గోశాలలోని గోవుల కు ఆహారం అందజేశారు.
భారీ స్థాయిలో
ఐఏఎస్‌ల బదిలీ
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత భారీస్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. హేమంత్ శర్మకు సమాచార – ప్రజా సంబంధాల అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కేటాయించారు. సంజీబ్ కుమార్ మిశ్రాను ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమించారు. 17 జిల్లాల్లో కొత్త కలెక్టర్లను నియమించారు. రూపా రోషన్ సాహు రాష్ట్ర గవర్నర్‌కు కమిషనర్ కమ్ సెక్రటరీగా నియమితులయ్యారు. 2014 సంవత్సరపు ఐఏఎస్ బ్యాచ్ అభ్యర్థి చంచల్ రాణాను భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనగా నియమించారు.

తహసీల్దార్ వాహనం అడ్డగింత

తహసీల్దార్ వాహనం అడ్డగింత

తహసీల్దార్ వాహనం అడ్డగింత