
ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత బుధవారం సందర్శించారు. వివిధ వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. మందుల నిల్వలు, ల్యాబ్‌లో పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి ఉన్నత ఉద్యోగలు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి అవసరమైన వసతులు, పరికరాలు, మందులు విషయాలు నమెదు చేసుకున్నారు. రోగులకు అందాల్సిన సేవలలో ఎటువంటి రాజీ పడవద్దని సిబ్బందికి సూచించారు. పర్యటనలో డాక్టర్ నబ కిషోర్ పండా, బీపీఎం సంతోషిని పండా, ఎంపీ ప్రతినిధి కై లాస్ చంద్ర ఖొస్లా, మెంటి ఖోరా, పేరెంట్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.