
విశిష్ట వ్యక్తులకు గవర్నర్ సత్కారం
భువనేశ్వర్: రాష్ట్ర సాహిత్యం, కళలు, క్రీడలు తదిత ర రంగాల్లో విశిష్ట గుర్తింపు పొందిన పలువురు ప్రముఖులకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రత్యేకంగా సత్కరించారు. స్థానిక రాజ్‌భవన్ న్యూ అభిషేక్ హాల్‌లో బుధవారం జరి గిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సతీమణి జయశ్రీ కంభంపాటి పాల్గొన్నారు. ఒడిశాకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, అంతర్జాతీయ బంగారు పతక విజేతలు, క్రీడాకారులు, 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ సందర్భంగా గవర్నరు సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ స్వయంకృషి, శ్రేష్ఠత, క్రమశిక్షణ, సృజనాత్మకత, జాతీయ కీర్తి కిరీటాల సమాహార సమావేశం ఈ కార్యక్రమమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ కమిషనర్, కార్యదర్శి రూపా రోషన్ సాహు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

విశిష్ట వ్యక్తులకు గవర్నర్ సత్కారం

విశిష్ట వ్యక్తులకు గవర్నర్ సత్కారం